స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు
స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు
సికింద్రాబాద్ జనవరి 24 (ప్రజామంటలు) :
కుమారుడి మరణంతో దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. వివరాలు ఇవి.... వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూచ్ బీహార్ జిల్లాకు చెందిన హితేన్ బర్మన్, పూర్ణిమా బర్మన్ దంపతుల కుమారుడు ఆదిత్య బర్మన్ (4 నెలల వయస్సు) శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. పుట్టుక నుంచే శ్వాస సమస్య, లివర్ సమస్యలతో ఉన్న తమ కుమారుడిని కూచ్ బీహార్ జిల్లా ఆస్పత్రి వర్గాల సూచన మేరకు గత నెల డిసెంబర్ 30న గాంధీ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. గాంధీ వైద్యులు బాలుడికి ఆపరేషన్ చేసినా ఫలితం దక్కలేదు. శుక్రవారం ఆ బాలుడు మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రి లోని జనహిత సేవా ట్రస్ట్ షెల్టర్ హోమ్ లో ఆశ్రయం పొందుతున్న హితెన్, పూర్ణిమ దంపతులు రోదిస్తూ ఉండగా సిబ్బంది గమనించి వివరాలు తెలుసుకున్నారు. తమ వద్ద డబ్బులు లేవని, బాలుడి మృత దేహంతో స్వగ్రామానికి వెళ్ల లేమని వారు చెప్పారు. దాంతో రియల్ వివేక్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, బన్సీలాల్ పేట్ లోని నాగన్న కుంట స్మశానవాటిక ఇన్చార్జి శంకర్ ల సహకారంతో బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. తమకు ఇక్కడ ఎవరు తెలిసిన వారు లేరని, మానవత్వంతో తమకు అండగా నిలిచిన జనహిత సేవా ట్రస్ట్, రియల్ వివేక్ ఫౌండేషన్, శ్మశానవాటిక ఇన్చార్జీ లకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులను ఈ ఘటన కలిచివేసింది. :