కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి
కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి
* రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు ) :
కొండపోచమ్మ సాగర్ నీటిలో మునిగి మృతిచెందిన సిటీకి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కొండపోచమ్మ సాగర్ నీటిలో మునిగి చనిపోయిన బన్సీలాల్ పేట డివిజన్ సీసీ నగర్ కు చెందిన దినేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. దినేష్ కుటుంబానికి అండగా ఉంటానని హామినిచ్చారు. దినేష్ ప్యామిలీ లో ఒకరికి ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూమ్ మంజూరీకి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ టి.రాజశేఖర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రామంచ మహేశ్, నాయకులు వై.సురేశ్ కుమార్, వై.శ్రీనివాస్, ఎస్.రాజు, విద్యామోహన్, లక్ష్మీ, హిమబిందు, అమీర్ పేట కార్పొరేటర్ కే.సరళ, కృష్ణ పాల్గొన్నారు.