మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు భారతరత్నా?
మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు భారతరత్నా?
న్యూ ఢిల్లీ జనవరి 23:
మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు భారతరత్న పురస్కారం వ్వలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది.ఈ ఏడాది భారతరత్న అవారుల జాబితాలో దివంగత మాజీ ప్రధాని మన్మోహ సింగ్, పారిశ్రామికవేత్త రతన్ టాటా పేర్లు ముందు ఉన్నాయి.
భారత పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. దేశానికి సేవ చేసిన వారికి ప్రశంసా పూర్వకంగా ఇచ్చే ఈ అవార్డును ఇప్పటివరకు 53 మంది అందుకున్నారు.
కళ, విజ్ఞానం, సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, ప్రజాసేవ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని సన్మానించేందుకు 1954లో 'భారతరత్న' అవార్డును ప్రవేశపెట్టారు. మొదట్లో జీవించి ఉన్నవారికి మాత్రమే ఇచ్చే ఈ అవార్డును 1955లో మరణించిన వారికి కూడా వర్తింపజేశారు.
ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి భారతరత్న పురస్కారం అందజేయగా, గతేడాది 5 మందికి భారతరత్న లభించింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో భారతరత్న అవార్డు గ్రహీతల జాబితాను రావ ప్రకటిస్తారు.
ఈ పరిస్థితిలో గతేడాది కన్నుమూసిన రతన్ టాటా, మన్మోహన్ సింగ్ లకు ఈ ఏడాది భారతరత్న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
రతన్ టాటా మరియు మన్మోహన్ సింగ్ మరణించినప్పుడు, భారతరత్న అవార్డు గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. రతన్ టాటాకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.