తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

On
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

హైదరాబాద్ జనవరి 20:

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి  శంకర్ భరద్వాజ పోపూరి  ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను  గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. imresizer-1737364287825

కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. 

తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి  దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.    శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా  ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు,  రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.

ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం  శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

 కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు  శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు  శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి,  సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి  ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్  హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.

Tags

More News...

Local News 

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల జగిత్యాల  జనవరి 20 (  ప్రజా మంటలు     )భారతీయ జనతా పార్టీ "సంవిధాన్ గౌరవ అభియాన్" కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి  నరేంద్ర...
Read More...
National  International   State News 

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ జనవరి 20: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ...
Read More...
Local News 

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం సికింద్రాబాద్​, జనవరి 20 ( ప్రజామంటలు): దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు...
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్    జగిత్యాల జనవరి 20  (ప్రజా మంటలు):స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే...
Read More...
Local News 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్ 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  గొల్లపల్లి జనవరి 20 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకురోడ్డు మరియు రహదారి భద్రత  మాసవోత్సవం   సందర్భంగా  గొల్లపల్లి మండల లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను  ఎస్ఐ,సతీష్ తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ పిల్లల్ని స్కూలుకు ఇంటికి వరకు...
Read More...
Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...