బ్రహ్మోత్సవాలలో పత్తాకు లేని రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు*
అప్రమత్తంగా విద్యుత్ శాఖ
మెరుగైన వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బంది
ప్రజామంటలు జనవరి 29 భీమదేవరపల్లి :
కొత్తకొండ సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ ఏఈ శిరీష్ కుమార్, సబ్ ఇంజనీర్ రఘు, మోహన్, లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్మెన్ వెంకట్ రెడ్డి, జేఎల్ఎంలు రామకృష్ణ, అరవింద్, రాజకుమార్, సాంబయ్య, తదితరులు విశేష సేవలు అందించి 24 గంటల విద్యుత్ సదుపాయం ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. వైద్యశాఖ డాక్టర్ మౌనిక నేతృత్వంలో హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, ఏఎన్ఎం అనిత కుమారి, హెచ్ఎ రామాంజనేయులు, సత్యవేద, ఆశా కార్యకర్తలు స్వరూప, గీత, వసంత, సరిత, సఖి కేంద్రం వన్ స్టాప్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ తదితరులు భక్తులకు సేవలు అందించారు.
*పత్తాకులేని రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు*
ల్యాండ్ అక్వేషన్ చేపట్టాల్సిన రెవెన్యూ శాఖ బైపాస్ రోడ్డు రైతులు స్థలాన్ని కేటాయించకపోవడంతో పోలీసుల జోక్యంతో అప్పటికప్పుడు సద్దుమణిగింది. రోడ్డుకు ఇరువైపులా పొదలను చెట్లను తొలగించి, తారు రోడ్డుపై ఉన్నగుంతలు పూడ్చకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతరలో ఈ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల వివిధ శాఖల అధికారులు తమ నెత్తిన భారం పడిందని వాపోయారు.