మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్
ప్రభాకర్ మరణం తీరని లోటు - డేగల సారయ్య
భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) :
తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉన్నది. బీఎస్పీ జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సేవలు అందించారు. పార్టీ ప్రతి అడుగులో అడుగై ముందుకు సాగిన ఉద్యమకారుడు ప్రభాకర్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ఉద్యమ కాలంలో ప్రొఫెసర్ కోదండరాం ఆశీస్సులతో చెరగని ముద్ర వేసిన ప్రభాకర్ అకాల మరణం అందరినీ షాక్‌కు గురి చే సింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి తన స్పీచ్ తో మండల ప్రజలలో ఉత్తేజం నింపాడు. మండల జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య మాట్లాడుతూ, పేదలకు మేలు జరగాలని తపించే ఎంతో భవిష్యత్ ఉన్న భావి నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయిందని అన్నారు.