యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ దాడిని ఖండించిన దావ వసంత సురేష్
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ దాడిని ఖండించిన దావ వసంత సురేష్
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాల దాడిని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తీవ్రంగా ఖండించారు.
ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు.
ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నుకున్న ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు.
మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.