ప్రజల దృష్టి మరల్చడానికి అక్రమ కేసులు- brs నాయకుల విమర్శ
ప్రజల దృష్టి మరల్చడానికి అక్రమ కేసులు- brs నాయకుల విమర్శ
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు)
ప్రజల దృష్టి మరల్చడానికే బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులనీ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, తొలి జెడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు
జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో మీడియా సమావేశంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కేటీఆర్ గారిపై ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కేస్ విషయంలో కావాలని అక్రమ కేసులు పెట్టడం, ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధం అని వారు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, గ్యారంటీలు, హామీలు అమలు చేయడం లేదు.. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, టి యస్ ను టి జి గా మార్చడం ఇటువంటి మార్పులే.. రైతు రుణమాఫీ ఇంకా కాలేదు.. రైతు భరోసా ఏది... 15 వేలు ఇస్తామని 12 వేలు ఇస్తామని చెప్పడం మాటలకే పరిమితం అయ్యాయని ఎద్దేవ చేశారు.
హామీలు, ప్రభుత్వ వైపాళ్యం గురించి మాట్లాడుతున్నందున కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజల ద్రుష్టి మరలుస్తున్నారని అని పేర్కొన్నారు.
రైతులు నాట్లు వేయడం, కొన్ని ప్రాంతాల్లో నాట్లు అయిపోయినా ఇంకా నీటి విడుదల లేదని... కేసీఆర్ హయాంలో రైతులకు నీటి వసతి గురుంచి రెండు నెలల ముందే సమీక్ష సమావేశము ఏర్పాటు చేసి నీటి విడుదలకు చర్యలు తీసుకునే వారు, రిజార్వయర్లు నింపి దాని ద్వారా చెరువులు, ఎత్తి పోతల పథకం ద్వారా తొందరగా నీళ్లు అందించాలని పేర్కొన్నారు.
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ కవిత , హరీష్ రావు , కొప్పుల ఈశ్వర్ సహకారంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ పునరుద్దరణ 0.25 టి యం సి నుండి
1.టి యం సి... పెంచడం జరిగిందని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు.
రోళ్లవాగు ప్రాజెక్ట్ మరో కమిషన్ ల ప్రాజెక్టు అనడం... మీరు విచారణ చేపట్టండని,ఇదివరకే మాజీ మంత్రి ఈశ్వర్ పత్రిక ముఖంగా చెప్పడం జరిగిందని... రైతులు నీటి గురుంచి కొట్లాడే పరిస్థితి ఉందని.. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా లేదు.. మహాలక్ష్మి 2500 లేవు, పెన్షన్ పెంపు లేదు.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ప్రజల ద్రుష్టి మరల్చాడానికే సీఎం ప్రయత్నమని.. అక్రమ అరెస్టులు, నిర్భందాలు తప్ప ఏమి లేదు అని ఏద్దేవా చేశారు...
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ గట్టు సతీష్, జగిత్యాల రూరల్ ఆయిల్నేని ఆనంద్ రావు, సారంగాపూర్ మండల అధ్యక్షుడు తెలు రాజు,రాయికల్ మండల అధ్యక్షుడు బర్కo మల్లేష్ యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సాగి సత్యం రావు, చాంద్ పాషా,నరేష్, వొద్నాల జగన్, రమేష్, చందు, సత్యం తదితరులు పాల్గొన్నారు.