సేవా భారతి సేవలు మరింత విస్తరించాలి.

వాల్మీకి ఆవాస భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎంపీ అరవింద్,.

On
సేవా భారతి సేవలు మరింత విస్తరించాలి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు) : 

అఖిల భారత స్థాయిలో సేవా భారతి సంస్థ సేవలు మరింత విస్తరించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లు అన్నారు.

సేవా భారతి ఆధ్వర్యంలో థరూర్ క్యాంపులో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్, సేవా భారతి అఖిలభారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి తదితరులు హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్ లు మాట్లాడుతూ...... దేశవ్యాప్తంగా సేవా భారతి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు గత 32 సంవత్సరాలుగా వాల్మీకి ఆవాస నిర్వాహకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. చదువుతోపాటు ఉత్తమ విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి గొప్ప గుణాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు వాల్మీకి ఆవాసం కృషి చేస్తుందన్నారు.

భవిష్యత్తులో సేవా భారతి చేపట్టబోయే ఏ కార్యక్రమానికైన తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం ఎంతోమంది నిరాశ్రయ బాలలకు అండగా నిలిచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

ఆవాస విద్యాలయానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ..... గీతా విద్యాలయం, వాల్మీకి ఆవాసం తో తనకు, తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 32 సంవత్సరాల క్రితం వాల్మీకి ఆవాసాన్ని ప్రారంభించినప్పుడు ఒక విద్యార్థిని దత్తత తీసుకొని సహకరించానని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాక మునుపు నుండి సేవా కార్యక్రమాలలోనే ఉన్నానని, సేవా భారతి చేపట్టిన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నానని తెలిపారు.

గతంలో ఒరిస్సాలో తుఫాను సంభవించినప్పుడు సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల నుండి ఒరిస్సా వెళ్లి ఉచిత సేవలందించిన డాక్టర్ల బృందం లో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. వాల్మీకి ఆవాసానికి ఎలాంటి అవసరం వచ్చిన తాను సహకరిస్తానని తెలిపారు.

సేవా భారతి అఖిలభారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,50,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవ ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ వాల్మీకి ఆవాసం కేంద్రంగా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నూతన భవనం 200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా ఉన్నందున ఈ భవనంలోనే గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అత్యాధునికమైన సంచార వైజ్ఞానిక ప్రదర్శనశాల తో పాటు కిషోర బాలికలకు వికాస శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోజురోజుకు దేశంలో విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఏ సేవా కార్యక్రమానికైనా దాతల సహకారంతో పాటు సమయం ఇచ్చే కార్యకర్తలఅవసరం కూడా ఉంటుందని ఆ దిశగా సమాజం ఆలోచించాలని సూచించారు.

సేవా భారతి రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్, వేణుగోపాలచార్య కౌశిక,కౌన్సిలర్ రాజకుమార్ లు ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆవాస భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ముఖ్య అతిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆవాస విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో ఆవాస కమిటీ సభ్యులు డాక్టర్ భీమనాత్ని శంకర్, జీడిగే పురుషోత్తం, మదన్ మోహన్ రావు, టీవీ సూర్యం, అశోక్ రావు, సంపూర్ణ చారి, మధుకర్, శ్రీనివాస్,మల్లారెడ్డి,సురేష్, కైలాసం, ఆవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

National  International  

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   సియోల్ జనవరి 15: దక్షిణ కొరియా అధికారులు బుధవారం ఉదయం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆయన అధికారిక నివాసంపై తెల్లవారుజామున జరిగిన నాటకీయ పోలీసు దాడి తర్వాత "రక్తపాతాన్ని నివారించడానికి" ఆయన లొంగిపోయారు. మార్షల్ లా విధించడానికి మరియు రాజకీయ నియంత్రణను...
Read More...
National  International  

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ముంబై జనవరి 15: BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఉన్నారుజయ్ షా మరియు ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన పదవులకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా దేవజిత్...
Read More...
National  State News 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే  24 అక్బర్ రోడ్ కార్యాలయం - ఇక ఒక చరిత్ర ఢిల్లీ జనవరి 15:‘24, అక్బర్ రోడ్’ 47 సంవత్సరాల చరిత్రతో ముగిసింది. నేడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తరలింపు.   కాంగ్రెస్ పార్టీ తన కొత్త ప్రధాన కార్యాలయం - నలభై...
Read More...
National  State News 

ఈ నాటి ప్రధాన వార్తలు

ఈ నాటి ప్రధాన వార్తలు ఈనాటి ప్రధాన వార్తలు - నేడే కాంగ్రెస్ కొత్త కార్యాలభవనం ప్రారంభం   హైదరాబాద్ జనవరి 15: ఢిల్లీలో సీఎం రేవంత్..కేంద్రమంత్రులను కలిసే అవకాశం    నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మృతుల గుర్తింపు. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. ప్రయాణికులు భైంసా కు చెందినవారుగా గుర్తింపు     తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్...
Read More...
Local News  State News 

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
Local News 

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ.... తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
Local News 

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
Local News 

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్ భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) : తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...
Local News 

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు గొల్లపల్లి జనవరి 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపెట లో సంక్రాంతి పండుగా సందర్భంగా యువ నాయకుడు ఆవారి చందు ఆధ్వర్యంలో  ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయం కృషితో ఎదిగి,మహిళా లోకానికి ఆదర్శం అయినటువంటి...
Read More...
Local News  State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కరీంనగర్ జనవరి 14:  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పెట్టిన కేసులో కరీంనగర్ కోర్టు బెయిల్మం జూరు చేసింది.మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిరూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశంసమీక్షా...
Read More...

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం బుభనేశ్వర్ జనవరి 14: ప్రపంచవ్యాప్తంగా 1200 మందికి పైగా బౌద్ధ సన్యాసులు ఒడిశాలో జరిగే మొదటి గురు పద్మసంభవ జప కార్యక్రమంలో పాల్గొనడానికి సమావేశమవుతున్నారు. జనవరి 13 ఆదివారం ప్రారంభమై జనవరి 16 వరకు కొనసాగే మొదటి గురు పద్మసంభవ జప...
Read More...