గంజాయి విక్రయిస్తున్న నిందుతుడిని పట్టుకున్న పోలీసులు. -368 గ్రాముల గంజాయి స్వాధీనం.
గంజాయి విక్రయిస్తున్న నిందుతుడిని పట్టుకున్న పోలీసులు. -368 గ్రాముల గంజాయి స్వాధీనం.
కోరుట్ల ఆగస్టు20:- కోరుట్ల మండలం పైడిమడుగు శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద గంజాయి నిందితుడు పెనుకొండ గణేష్ (వడ్డెర) ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కోరుట్ల ఎస్సై కే. శ్వేత కి ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం చాకచక్యంగా పట్టుకున్నారు.
కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుట్ల సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ పెనుకొండ గణేష్ మేడ్చల్ మల్కాజ్ గిరి లో ఉండే ఓ కాలేజీ లో బి టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ కు తల్లి ఇచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక, ఇంకా సంపాదించాలని దురాలోచనతో తక్కువ ధరకు నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి, దాని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుందామని ఆలోచనలతో, గణేష్ గత కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయిని కొని దానిని కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాలలో యువతకు గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి గంజాయిని అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గణేష్ తన వద్ద గల గంజాయిని కోరుట్ల పట్టణ చుట్టుపక్కల గ్రామాలలో యువతకు అమ్ముట కొరకు తన యొక్క మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని పక్కా సమాచారంతో ఎస్పీ జగిత్యాల ఆదేశాల మేరకు , మెటుపల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో, కోరుట్ల సి ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కోరుట్ల ఎస్సై కే. శ్వేత సిబ్బంది సాగర్, పవన్ కుమార్, శ్రీనివాస్ లు కలిసి పైడిమడుగు గ్రామ శివారులో నిందితుడు గణేష్ తన మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్దనుండి 368 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కోరుట్ల సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని వాటికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఎవరైనా గంజాయిని త్రాగిన, కొన్న, అమ్మిన చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గంజాయి నిందితుడిని పట్టుకున్న కోరుట్ల ఎస్సై కె. శ్వేత, సిబ్బందిని మెటుపల్లి డిఎస్పీ, జిల్లా ఎస్పీ
అభినందించారు.