జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
దేశ సేవకు పునరంకితం కావాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
*- -
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 15( ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయం లో గురువారం 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.....
ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 78 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవo ను పురస్కరించుకొని తెలంగాణ కల్చర్ అనే అంశంపై పెయింటింగ్ కాంపిటీషన్ పిల్లల కు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాంపిటీషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన
1వప్రైజ్: సి హెచ్ .స్ఫూర్తికా,
2 ప్రైజ్: సి హెచ్. శృతిక,
3 ప్రైజ్: ఏ.నివాన్షి లకు ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి లు రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు,రంగా రెడ్డి,రవీంద్ర కుమార్, ఏ .ఓ శశికళ , ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ ,రిజర్వు ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, కిరణ్ కుమార్ , వేణు, మరియు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ లు, డిపివో కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.