కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాల గోడ ప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) :
తేదీ. 30-05-2024 నుండి తేదీ. 01-06-2024 వరకు కొండగట్టు వేంచేసి యున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ, పూజ, అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు.
ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం రోజున తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
శ్రీ హనుమాన్ జయంతి రోజు వారి కార్యక్రమ వివరాలు:
- 29-05-2024 ( బుధవారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన.
- 30-05-2024 (గురువారం) ఉదయం 6 గంటలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షాబంధనము, ఋత్విక్ వరణము, అరుణి మధనము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ట హవనము, అభిషేకములు, ధ్వజారోహణము, నవగ్రహ స్థాపన, పారాయణాలు నైవేధ్యము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు హోమము, మహా నైవేధ్యము, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు.
- 31-05-2024 (శుక్రవారం) ఉదయం 9 గంటలకు హోమము, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణము, అభిషేకము, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన సహస్రనామార్చన (పుష్పాలతో), పారాయణాలు, హోమము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.
- 01-06-2024 (శనివారం) ఉదయం 3 గంటలకు తిరుమంజనము మరియు ద్రావిడ ప్రబంధ పారాయణములు
- ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
- ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
- సాయంత్రం 5 గంటలకు ఆరాధన
- సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
- సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
- సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
- సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ
- సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, డిప్యూటీ ఈ . ఓ అంజయ్య పాల్గొన్నారు.