సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 03 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ లో విద్య, వైద్య సేవలకు స్థానిక శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నారని సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, బీ.ఆర్.ఎస్. యువ నేతలు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ డివిజన్ల సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సీతాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని రూ.ఆరు లక్షల విలువ జేసే 23 చెక్కులను, రూ.2 లక్షల ఎల్.ఓ.సీ. పత్రాలను రోగులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రజలు తమ అవసరాలకు సీతాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పార్టీ నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
––––––––––
-* ఫొటో: