ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల  స్వీకరణ ప్రారంభం.. గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు.. టీచర్స్ స్థానానికి ముగ్గురు.. మొత్తం 13సెట్ల నామినేషన్లు దాఖలు.

On
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల  స్వీకరణ ప్రారంభం.. గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు.. టీచర్స్ స్థానానికి ముగ్గురు.. మొత్తం 13సెట్ల నామినేషన్లు దాఖలు.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల 
స్వీకరణ ప్రారంభం 
గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు..
టీచర్స్ స్థానానికి ముగ్గురు
-ఎన్నికల అధికారి 
పమేలా సత్పతి 

కరీంనగర్ ఫిబ్రవరి 03:

మెదక్ నిజామాబాద్ కరీంనగర్ అదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 13సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. 

సోమవారం నాడు రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ అనంతరం మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండడం వల్ల నామినేషన్లు స్వీకరణ జరగదని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13 న  నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ లు

నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సందేహాలను నివృత్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి తూ.చ తప్పకుండా పాటించాలని ,ర్యాలీలు, సమావేశాలు, సభలు తదితర వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆమె కోరారు .
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు  తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు 

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి..

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి ఇటు గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్ కు చెందిన కంటే సాయన్న గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక్కొక్క సెట్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ కు చెందిన చాలిక చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అదిలాబాద్ కు చెందిన మంచికట్ల ఆశమ్మ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.

టీచర్స్ ఎమ్మెల్సీ కి ముగ్గురు..

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూర రఘోతంరెడ్డి, చాలిక చంద్రశేఖర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక్కొక్క సెట్టు నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయా అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. పోలీసులు ఈ మేరకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! 19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా! చెన్నై ఫిబ్రవరి 05: శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
National  International   State News 

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05: మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు. బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
Local News 

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
National  Local News  State News 

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
Local News 

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
National  Local News  State News 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
National  State News 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04: కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
Local News 

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన      *  దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ సికింద్రాబాద్​, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) : సికింద్రాబాద్ ఎస్​డీ రోడ్డు లోని అవినాష్​ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్​ఎస్​వీ నాయకులు ఆందోళన నిర్వహించారు.  కాలేజీ గేట్​ వద్ద బైఠాయించి, డిగ్రీ  విద్యార్థి రాహుల్​ కు న్యాయం చేయాలని...
Read More...

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం హన్మకొండ ఫిబ్రవరి 04: చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
Local News 

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి : కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...
Local News 

కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య 

కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య  కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు): డబ్బా గ్రామానికి చెందిన నునావత్ సునీత  ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోల్డఇసుల్బ్బాu తెలిపారు. ఎనిమిది సం .లో క్రితం భర్తతట్నo విడాకులు తీసుకొని, డబ్బా గ్రామంలోని తన అన్నదమ్ముల స్థలంలో రేకుల షెడ్డు...
Read More...