అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన - గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
బోటు ప్రమాదంలో మృతి చెందిన అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
* గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
సికింద్రాబాద్, జనవరి 29 ( ప్రజామంటలు) :
భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజా వేదికగా ఈనెల 26 న నిర్వహించిన భారతమాత మహాహారతి సందర్బంగా జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన చిలువేరు అజయ్ మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, విద్యార్థులు, బీసీ సంఘ నాయకులు పెద్దసంఖ్యలో మార్చురీ వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
స్పష్టమైన హామి ఇచ్చేవరకు మృతదేహాన్ని తరలించేది లేదన్నారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి ప్రతినిధి దాసు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. రూ.10a కోట్ల నష్టపరిహారం, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూంఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయపోరాటానికి సిద్ధమన్నారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అనుదీప్‌లు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గీయులు అక్కడకు చేరుకుని నిరసనకారులకు సర్ధిచెప్పారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అజయ్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్ధలానికి తరలించారు.
–––––––––––––––
–ఫొటో: