ఓ మహాత్మా - ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరపించు. - దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు) :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, పూలమాలవేసి నివాళులర్పించి,కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల భావి చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి వినతి పత్రం జిల్లా బిఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్..
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ....
- జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహని కి, శిరస్సు వంచి పాదాభివందనాలు.
- ఈ అసమర్ధ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా మీ ఆశయాలే స్పూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.
- సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.
- తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మారి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్దిదిద్దాం..
- అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది.
- మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు.
- ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
- దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది.
- రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది.
- చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది.
- ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లు, వేళాపాళా లేని కరెంట్ కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు, ఓవైపు రుణమాఫీ మోసం. మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు కారణమైంది ఈ కాంగ్రెస్ సర్కారు.
- మరోవైపు నేతన్నలకిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారు.
- వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏడాదైనా ఉలుకూ పలుకూ లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
- యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేశారు.
- చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారు.
- యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్నారు.
- 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా 420 రోజులైనా సరిగా అమలుచేయని ఈ కాంగ్రెస్ సర్కారు మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి.
గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలిమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.
గాలిమోటర్లో వచ్చి గ్యారెంటీ కార్డు పేరిట, డిక్లరేషన్ల పేరిట దగా చేశారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పటివరకు ఆ నకిలీ గాంధీలు తెలంగాణ వైపు కనీసం కూడా కన్నెత్తి చూడలేదు.
ఓ వైపు రైతులను, మరోవైపు మహిళలను, ఇంకోవైపు వృద్ధులు, వికలాంగులను 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.
నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, పట్టణ ఉపాధ్యక్షుడు వొళ్లం మల్లేష్,అర్బన్ రూరల్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్ ఆనంద రావు,నాయకులు గంగారెడ్డి వెంకటేశ్వర్లు, నక్క గంగాధర్, నాడెం శంకర్, రిజ్వన్ దేవేందర్ నాయక్, బుర్ర ప్రవీణ్ గౌడ్, రాజన్న, మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి,భక్కషెట్టి లక్మీ యూత్ నాయకులు హరీష్, సనిత్ రావు,ప్రణయ్, ప్రతాప్, భగవాన్, వెంకట్, భూమేష్, ఆసీఫ్, వేణు మాధవ్, ఫాహాడ్, అజయ్, సాయి చందు, శ్రీనివాస్, నవీన్, పెండం చిన్న గంగాధర్,గంగాధర్ తరుణ్ ,లక్ష్మన్, రాము, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.