నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరు - నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరు - నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ జనవరి 28:
నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరని నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.
పాలిచ్చే ఆవును కాదనుకొని.. ఎగిరెగిరి తంతున్న దున్నపోతును తెచ్చుకొని కష్టాలు పడుతున్నారని రైతులు అంటున్నారని, ఆరేళ్ల పాటు యాసంగికి, వానా కాలానికి లెక్కపెట్టుకుంటా పన్నెండు సార్లు రైతుబంధు వేసిండు కేసీఆర్, కానీ ఏనాడూ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నట్లు ప్రచారాలు చేసుకోలేదని నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఇలా అన్నారు:: నాడు కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు వేస్తే.. రేవంత్ మాత్రం పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లప్పుడు మాత్రమే వేస్తున్నాడు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చేరుకుని, విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీలదీస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. రైతు మహాధర్నాని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని, కేసులు వేసి ఆపాలని చూశారు.
కానీ ఇక్కడ ఉన్నది కేసీఆర్ తయారు చేసిన దళం, మేం ఇలాంటి ఉడత ఊపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదు.
నల్లగొండ రైతు మహా ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ,ఆనాడు సాయుధ పోరాటానికి స్ఫూర్తి నింపిన నల్లగొండ.. నేడు ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై తిరుగుబాటుకు వేదిక కావాలని అన్నారు.
సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ రైతులు ఆందోళనకు దిగారు.కూడవెల్లి వాగు పరిసర ప్రాంతంలో రైతులు సాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.