మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు
మాతృ గయ జనవరి 24 (ప్రజా మంటలు) మాతృదేవతకు శ్రాద్ధం చేయడం కేవలం మాతృగయ సిద్దుపూర్ ప్రాముఖ్యత. మాతృశ్రీకి, పిత్రుడికి కొడుకులు మాత్రమే శ్రాద్దం నిర్వహిస్తారు కానీ మాతృగయాలో కుమారుడు ,కుమార్తె సైతం కర్మ నిర్వహించడం ఇక్కడి స్థల విశేషం.
పూర్వము ఈ గ్రామం పేరు శ్రీ స్థల్ ఇక్కడ రాజు సిద్ధ రాజ్ జై సింగ్ పేరు మీద సిద్దు పూర్ గా మార్చబడింది. తొలుత పరశురాముడు తన తల్లి అయిన రేణుకా దేవికి ఇక్కడే పిండ ప్రధానం చేశాడని స్థానిక కథనం. దీంతో కేవలం మాతృ గయా లో తల్లి కి సంబంధించి శ్రాద్ధం చేయడం ఇక్కడ విశేషం. ఇచ్చట శ్రీహర్ష బిందు సరోవరం ఉన్నది .ఈ సరోవరంలోని నీరు పవిత్ర మైనదిగా భావించి ఈ జలాలను తమ శిరములపై చల్లుకొని పవిత్రత పొందినదిగా భావిస్తారు. ఇక్కడ గోశాల కలదు .పిండ ప్రధాన అనంతరం గోవులకు పిండాలను సమర్పిస్తారు. మాతృశ్రీని స్మరిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు.