సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సికింద్రాబాద్ మూ జనవరి 23 (ప్రజామంటలు):
కుల,మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ఉద్దేశించిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలులో సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తమ వారికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారని సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బహిరంగంగా జరగాల్సిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాల చెక్కుల పంపిణీని నాలుగు గోడల మద్య నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఇంచార్జీ, ఇతర నాయకులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం సరికాదన్నారు. ఇది ప్రజల కార్యక్రమమా...లేక పర్సనల్ ప్రొగ్రామా..అని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎస్.ఎస్ రావు, గంటా సుధీర్, త్రికాల మనోజ్, ప్రతాప్ నాయక్, మధుగౌడ్ పాల్గొన్నారు.