పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం - కానీ ప్రోటోకాల్ ను పాటించలేదు - MLC కవిత
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం - కానీ ప్రోటోకాల్ ను పాటించలేదు
నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం
నిజామాబాద్ జనవరి 19:
పసుపు బోర్డు ఏర్పాటుపై స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం.పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని ఆమె అన్నారు.
పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్ పాటించలేదు
కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం.2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను
ప్రధాన మంత్రిని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిశాను.పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తేనే పసుపు ఆధారంగా రావాల్సిన పరిశ్రమల కోసం కృషి చేశాను.
పసుపుకు రూ. 15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశాను త్రిముఖవ్యూహంతో అలుపెరగని పోరాటం చేశాను.కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదు.... మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది
ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతుంది... దాంతో రైతులు నష్టపోతున్నారు.పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో నేను డిమాండ్ చేస్తున్నాను.
2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతవుతే... ఇప్పుడు రెట్టింపయ్యింది.ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు కాకపోతే... వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నాను.పసుపుకు పాటు రూ 15 వేల మద్ధతు ధర ప్రకటించాలి
ఎంపీ అర్వింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటుతాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరు.
కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్.ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని అర్వింద్ అన్నారు
తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైంది.అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదం
స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది... పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారు.ఒకవేళ బెంజ్ కారు ఉంటే... అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు ?
ఎందుకు ఇంత వైరాధ్యంతో రకరకాల మాటలు చెబుతున్నారు ?ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి.ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది.కానీ అది తన ఘనత అని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది
రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి.స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం 42 ఎకరాలు కేటాయించారు.
ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది.అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్ ను డిమాండ్ చేస్తున్నాను