అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా.!
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా.!
హైదరాబాద్ డిసెంబర్ 30:
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై అల్లు అర్జున్‌కి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసిన కోర్టు రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా ఈ రిమాండ్ ముగియడంతో అదే రోజు ఆయన వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది. అయితే నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టి.. తీర్పును జనవరి 03కి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై అల్లు అర్జున్‌కి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పిటిషన్‌లపై నేడు విచారణ జరిగింది. అల్లు అర్జున్ తరఫు లాయర్‌లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు ధర్మాసనంకు వినిపించారు. అయితే ఇరు పక్షల వాదానలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది.