ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం.
- టీఉద్యోగుల జేఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 18( ప్రజా మంటలు ) :
రాష్ట్రంలోని ఉద్యోగుల,ఉపాధ్యాయుల,కార్మికుల,పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీ ఉద్యోగుల జేఏసి రాష్ట్ర చైర్మన్,టీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు.
ఆదివారం జిల్లా టీ ఎన్జీఓల సంఘ భవన్ ఆవరణలో మొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంకు వచ్చిన జగదీశ్వర్ ను టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ , జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలొ జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ రూపకల్పన కు 15 మందితో రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూర్వక సర్కారు అని చెప్పి చివరకు సంఘాలను నిర్వీర్యం చేయాలని చూసిందని,ఒకటో తేదీన వేతనాలు కూడా ఇవ్వలేదన్నారు. కొత్త ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు,పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపి లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
పెండింగ్ డి.ఏ.లు, పీ ఆర్ సీ అమలు, నగదు రహిత వైద్య సేవలు,317 జీవో,సి.పి.ఎస్.రద్దు,ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలు,పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటు వంటి 36 సమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు.త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలిసి మాట్లాడుతామని పేర్కొన్నారు..
టీ ఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్, జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి, కోశాధికారి షాహిద్ బాబు, సహ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, టీపెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, టి.జీ.ఓ. నామకులు కందుకూరి రవి బాబు, అరిగెల అశోక్, నాల్గవ తరగతి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, ఉపాధ్యాయ సంఘ నాయకులు వొడ్నాల రాజశేఖర్, బైరం హరికిరణ్, కార్మిక,పెన్షనర్ల నాయకులు వెల్ముల ప్రకాష్ రావు, టిఎన్జిఒ నాయకులు రవిచంద్ర, రవిందర్, మమత, రాజేశం, సుగుణాకర్, మధుకర్, మహమూద్, భువనేశ్వర్, కుమార స్వామి, ప్రమోద్, ప్రసాద్, సురేందర్, సోహెల్, ముజాహిద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.