14 వ రోజుకు చేరిన జగిత్యాల జర్నలిస్టుల నిరసన దీక్షలు.
14 వ రోజుకు చేరిన జగిత్యాల జర్నలిస్టుల నిరసన దీక్షలు.
జగిత్యాల ఆగస్టు 16:
ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్ష 14వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు.
జగిత్యాల రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు తమ సంఘీభావం తెలుపుతూ 14వ రోజు దీక్షలను నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సేవ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టుల న్యాయమైన కోరికను తీర్చే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు జమాల్, తిరుపతి, శేఖర్,శివ అబ్దుల్ సలాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.