వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మొక్కు నెరవేర్చుకున్న మంత్రి

On
వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.

 

*మొక్కు తీర్చుకున్న మంత్రి*

 

అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.

 

*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*

 

 

శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.

 

*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*

 

ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

 

*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*

 

- మంత్రి పొన్నం ప్రభాకర్

 

భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

 

*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*

 

 రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.

 

*27 రోజుల దీక్ష*

 

వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.

 

*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*

 

హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పేట కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్.

పేట కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 15 జనవరి (ప్రజా మంటలు) :  ఈ రోజు ఎమ్మెల్యే చే 2025 సంవత్సరానికి సంబంధించిన పేట కేలండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... క్రీడాకారుల అభివృద్ధిలో వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఏళ్ల వేళలా కృషి చేస్తుందని కోరారు....
Read More...
Local News 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పలు పథకాల ఆర్జీల విచారణ అధికారుల శిక్షణ కార్యక్రమం

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పలు పథకాల ఆర్జీల విచారణ అధికారుల శిక్షణ కార్యక్రమం జగిత్యాల  జనవరి 15 ( ప్రజా మంటలు)    ప్రభుత్వం ద్వారా  ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఒకటి రైతు భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను విచారణ జరుకుటకు గ్రామంలో వారిగా నియమించబడిన టీం అధికారులతో ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం  ఆదేశంలో మేరకు...
Read More...
Local News 

ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు

ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై గత ఆదివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  కరీంనగర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు  మరియు అనుచిత ప్రవర్తన ఘటనపట్ల  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఖండించింది. ఈ సందర్భంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...
National  State News 

స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎటువంటి పాత్ర లేదు: కెసి వేణుగోపాల్ 

స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎటువంటి పాత్ర లేదు: కెసి వేణుగోపాల్  స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎటువంటి పాత్ర లేదు: కెసి వేణుగోపాల్  న్యూ ఢిల్లీ జనవరి 15: స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకుల ప్రమేయం లేకపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విమర్శించారు, ఒక వార్త సంస్థకు ఇచిన ఇంటర్వ్యూలో ఆయన,రాహుల్ గాంధీ ఈ భావనపై దాడి చేసి, వారి దేశ వ్యతిరేక చర్యలను...
Read More...
National  State News 

పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం

పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం హైదరాబాద్ జనవరి 15: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎక్కువగా కృషి చేసింది ముమ్మాటికీ బి అర్ ఎస్  నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  అని బిఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. అనేక దశాబ్దాలుగా అక్కడి రైతులు పసుపుబోర్డు...
Read More...
Local News 

ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.

ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్. ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్. గొల్లపల్లి జనవరి 15 (ప్రజా మంటలు): ధర్మపురిలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల ప్రయోజనాల కొరకు సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.  బుదవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ...
Read More...
Local News 

గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం జనవరి 15: ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని,దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ...
Read More...
Local News  State News 

మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు

మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు జగిత్యాల జనవరి 15: రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి.ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్  అసీఫొద్దీన్ ను...
Read More...
National  International  

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   సియోల్ జనవరి 15: దక్షిణ కొరియా అధికారులు బుధవారం ఉదయం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆయన అధికారిక నివాసంపై తెల్లవారుజామున జరిగిన నాటకీయ పోలీసు దాడి తర్వాత "రక్తపాతాన్ని నివారించడానికి" ఆయన లొంగిపోయారు. మార్షల్ లా విధించడానికి మరియు రాజకీయ నియంత్రణను...
Read More...
National  International  

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ముంబై జనవరి 15: BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఉన్నారుజయ్ షా మరియు ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన పదవులకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా దేవజిత్...
Read More...
National  State News 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే  24 అక్బర్ రోడ్ కార్యాలయం - ఇక ఒక చరిత్ర ఢిల్లీ జనవరి 15:‘24, అక్బర్ రోడ్’ 47 సంవత్సరాల చరిత్రతో ముగిసింది. నేడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తరలింపు.   కాంగ్రెస్ పార్టీ తన కొత్త ప్రధాన కార్యాలయం - నలభై...
Read More...
National  State News 

ఈ నాటి ప్రధాన వార్తలు

ఈ నాటి ప్రధాన వార్తలు ఈనాటి ప్రధాన వార్తలు - నేడే కాంగ్రెస్ కొత్త కార్యాలభవనం ప్రారంభం   హైదరాబాద్ జనవరి 15: ఢిల్లీలో సీఎం రేవంత్..కేంద్రమంత్రులను కలిసే అవకాశం    నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మృతుల గుర్తింపు. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. ప్రయాణికులు భైంసా కు చెందినవారుగా గుర్తింపు     తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్...
Read More...