పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్, చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్, చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణం అభివృద్ధి పారిశుధ్యం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు.
జగిత్యాల కేంద్రంలో చేపడుతోన్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకస్మిక తనిఖీ చేశారు.
పురపాలిక పరిధిలో నిర్మించనున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.పట్టణ ప్రగతి నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ముందుండాలని పేర్కొన్నారు.
జగిత్యాల పట్టణ అభివృద్ధికి సమస్టిగా అధికారులు కృషి కలెక్టర్ సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
పట్టణ పారిశుద్ధ్య, అభివృద్ధి, గ్రీనరీ పనులపై కలెక్టర్ తో మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.