రైతు నేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
రైతు నేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మేడిపల్లి జూలై 18 (ప్రజా మంటలు) :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 500 కేంద్రాలలోని రైతు వేదికల వద్ద *”రైతు నేస్తం” కార్యక్రమం మరియు రైతులతో పరస్పర చర్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులతో పరస్పరం మాట్లాడటానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, వ్యవసాయ అధికారి వాణి, తహశీల్దార్లు,ఎంపిడిఓలు,మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు సంఘ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు రైతు వేదిక వద్ద రైతులు ముఖ్యమంత్రి రుణ మాఫీ చేసిన సందర్భంగా బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.