ఉపాధ్యాయునిగా మారిన మున్సిపల్ కమిషనర్

On
ఉపాధ్యాయునిగా మారిన మున్సిపల్ కమిషనర్

ఉపాధ్యాయునిగా మారిన మున్సిపల్ కమిషనర్
జగిత్యాల జులై 11 (ప్రజా మంటలు) :
జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గురువారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా అవతారం ఎత్తాడు. వివరాలకు వెళ్తే గురువారం స్థానిక మినీ స్టేడియంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించటానికి పనుల పర్యవేక్షణకు మినీ స్టేడియం సందర్శించారు. అక్కడ ఉన్న వాకర్స్ తో కాసేపు ముచ్చటించారు. అనంతరం రైతు బజార్ వద్ద రోడ్డుపైన కూరగాయలు అమ్ముతున్న వ్యాపారస్తులతో మాట్లాడి క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. మార్గమధ్యలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఆవరణ అంతా కలియతిరిగి పారిశుద్ధ్య సిబ్బందితో పరిసరాలు శుభ్రం చేయించారు. అనంతరం విద్యార్థులకు ప్రేరణ కలిగేలా ఉపాధ్యాయునిగా వ్యవహరించి తెలుగు వర్ణమాలతో పాటు గణితంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భావి జీవితంలో భావి భారత పౌరులుగా ఎదగడానికి ప్రాథమిక విద్య సమయంలో నేర్చుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు .ఆయన బోధన విధానాన్ని చూసి చిన్నారులు అబ్బురపడ్డారు.
Tags