కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

On
కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

న్యూఢిల్లీ జూన్ 16 (ప్రజా మంటలు) : 

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారం నాడు తెలిపారు. 

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు. 

మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అసవరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) అందిస్తుందని చెప్పారు.

జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్శిటీ లకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. 

కాగా,

  • భారతీయ నాగరిక్ సురక్ష సంహి కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించ నున్నారు.
  • భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు (ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా) ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. 

భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు (సీఆర్‌పీసీ లోని 484 సెక్షన్ల స్థానే) ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్‌ సెక్షన్లు చేర్చారు.

  • భారతీయ సాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు (ఒరిజనల్ ప్రొవిజన్లు 167) ఉండగా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు.

ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకు వచ్చారు.

Tags