కాంగ్రెస్ - బిఆర్‌ఎస్ తోడుదొంగల పార్టీలు బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపత్ రావు
కాంగ్రెస్ - బిఆర్‌ఎస్ తోడుదొంగల పార్టీలు
బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపత్ రావు
జమ్మికుంట ఏప్రిల్ 15 (ప్రజామంటలు): దేశభద్రతకు మోడీ అవసరమని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరి చేస్తున్నారని రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కొంత మంది అభిప్రాయపడుతుంటే... పూటకొక పార్టీ మారే నాయకులు మాత్రం బిజెపి పార్టీని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీద తెలిసి తెలియని వారు అవాక్కులు, చేవాక్కులు చేస్తూ, కాంగ్రెస్ నాయకుల కొంతమంది నాయకుల మద్దతు కోసం పాకులాడుతున్నారని, అందులో ఒకరు వొడితల ప్రణవ్ బాబు అని బీజేపీ జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ లోని హుజురాబాద్ అసెంబ్లీలో మాజీ ఎంపీ ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ అసెంబ్లీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తన సొంత పేరు కోసం చిన్న చిన్న సమాజ కార్యక్రమాలు నిర్వహించాడే గాని అతని కంటే ఎక్కువ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మంత్రి బహిరంగ చర్చకు రమ్మని దానికి బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ లాంటి నాయకులు పాల్గొంటారని మీరు గతంలో చేసిన అభివృద్ధితో, మేము ఈ ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చి ద్వారా నిరూపిద్దామని సంపెల్లి సంపత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గిర్నాల ఐలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.