అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన
అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన
* దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) :
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డు లోని అవినాష్ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన నిర్వహించారు. కాలేజీ గేట్ వద్ద బైఠాయించి, డిగ్రీ విద్యార్థి రాహుల్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇద్దరు విద్యార్థుల మద్య జరిగిన గొడవలో దళిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి రాహుల్ ఒక్కడినే టార్గెట్ చేసి సస్పెండ్ చేసి, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పేదల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తూ, స్టూడెంట్స్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న కాలేజీ అనుమతులను రద్దు చేయాలని కోరారు. దళిత విద్యార్థిని చీకటి గదిలో వేసి కొట్టిన అవినాష్ కాలేజీ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బౌన్సర్లతో కాలేజీని నడపడం ఏమిటని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి దశరథ్, నాయకులు జంగయ్య, చంద్రకాంత్,నాగేందర్, అద్విత్ రెడ్డి,రాకేశ్,సాయి, సంజు పాల్గొన్నారు.
పోలీసుల బందోబస్తు:
ఎలాంటి అవాంచానీయ సంఘటనలు జరగకుండా గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.తాము స్టూడెంట్స్ ను అంతా సమానంగా చూస్తామని, ఎవరిపైన తమకు విద్వేషాలు లేవని కాలేజీ నిర్వాహకులు సృష్టం చేశారు. ఇద్దరు స్టూడెంట్స్ ను సస్పెండ్ చేశామే తప్ప ఎవరికి టీసీ ఇవ్వలేదన్నారు. సస్పెండ్ అయిన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే తాము పోలీసుల రక్షణ కోరామన్నారు.