3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పి అశోక్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ క్రీడలొ జిల్లా కి చెందిన క్రీడాకారులు 3-రజత మరియు 2-కాంస్యం పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.
ఇదే స్పూర్తిని కనబరుస్తూ రాబోవు రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
- AR హెడ్ కానిస్టేబుల్ రాజు,Hammer Throw, 1 Silver medal.
- AR కానిస్టేబుల్, T.మల్లేశం,Table Tennis,1 Bronze medal.
- AR కానిస్టేబుల్ D.నరేందర్, Weight Lifting 1 Silver, Power Lifting, 1 Bronze Medal.
- AR కానిస్టేబుల్ సాయి మాధవన్ , Yoga,1 Silver medal.
ఈ కార్యక్రమములో అదనపు ఎస్పి బీమ్ రావు, RI లు కిరణ్ కుమార్ ,రామకృష్ణ పాల్గొన్నారు.