నూక పెల్లి శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, వసంత పంచమి వేడుకలు.
చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది...
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
జగిత్యాల జిల్లా లోని నూక పెళ్లి కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
వసంత పంచమి ఈ సందర్భంగా చదువుల తల్లిని సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది.
సోమవారం ఉదయం నుంచే అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పలకపై అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం భక్తులు చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.