సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు - రైతులను రుణ విముక్తులను చేసేందుకు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే -జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్
సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు - రైతులను రుణ విముక్తులను చేసేందుకు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే -జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జనవరి 11:
రైతులను రుణ విముక్తులను చేసేందుకు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని,సాగు నీటి సరఫరా మేడిగడ్డ, అన్నారం సుందిళ్ళ కుంగిపోయాయి . దీంతో కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందించే భారం ఎస్ ఆర్ ఎస్ పి పై పడుతున్నప్పటికి సాగు నీటికీ ఇబ్బంది లేకుండా పది లక్షల ఎకరాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కాళేశ్వరం లోటు కనపడకుండా చర్యలు చేపట్టాని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఖరీఫ్ లో ఉమ్మడి రాష్ట్రం కన్న ధాన్యం అధికంగా దిగుబడి వచ్చింది.వ్యవసాయం, రైతాంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది..
బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా రైతులకు రుణ మాఫీ చేయడం లేదు. రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు..రైతులను రుణ విముక్తులను చేసేందుకు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే.
రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు..సాగు యోగ్యమైన భూమి ఎంత మొత్తం అనే పరిమితి లేకుండా, ఏవిధమైన ఆంక్షలు లేకుండా రైతు భరోసా 26 నుండి అమలు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అని గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మన్ నిది కింద రైతులకు ఎంత భూమి ఉన్న కేవలం 6000 మాత్రమే ఇస్తొందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి 12000 ఇస్తుందని అన్నారు.
సాగు నీటికి సమస్య లేకుండా, విద్యుత్ కు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ధాన్యానికి రు.500 బోనస్ ఇస్తున్నాం.
ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
రోళ్ళ వాగు ఎనిమిదేళ్లుగా పూర్తి కాకపోవడంతో తో సాగు నీటి సమస్య ఏర్పడింది.
సాగు నీటి సమస్యను రైతులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కు దృష్టికి తీసుకు రావడంతో సమీక్షించి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించి, నీటి విడుదలకు చర్యలు చేపట్టారు.
గోదావరి నది పై సుమారు 15 ఎత్తి పోతల పథకం అండగా, గోదావరి లో నీరు లేక సాగు ప్రశ్నార్థకం అయింది.
11,946 ఎకరాల సాగు కు నీరు అందించేందుకు ఒక టీ ఏం సీ నీరు అవసరం అవుతుందని, సాగు నీరు విడుదల కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినం.
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, 1టీ ఏం సీ నీరు విడుదలకు కృషి చేసినం.రైతులు నీరు వృథా కాకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.
వరద కాలువ నీరు జగ్గసాగర్ నుండి పెద్దాపూర్ వాగు ద్వారా బోర్న పల్లి వద్ద గోదావరి వద్ద కలుస్తుంది.అధికారికంగా ఒక టీ ఏం సీ నీరు విడుదల చేసీ రైతులకు సాగు నీరు అందిస్తున్నాం..
గతంలో బీ ఆర్ ఎస్ ఏం చేశారో గుర్తు చేసుకోవాలి. రోళ్ల వాగు సాంకేతిక లోపం తో తెగిపోయి, వందల ఎకరాల్లో భూములు కోతకు గురి అయ్యింది.
ఉపాధి హామీ భూమి లేని కూలీలకు 12000 అందజేయనున్నం.
వ్యవసాయ పంటలకు మద్దతు ధర అందజేయడం ప్రభుత్వ బాధ్యత.యాసంగి లో కూడా సన్న రకాలకు రు.500 బోనస్ అందజేస్తాం.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
గోదావరిలో నీరు లేక ఎత్తిపోతల పై ఆధారపడిన రైతులు ఆందోళన చెందడం తో కలెక్టర్ తో సమీక్ష సమావేశమ నిర్వహించి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్ళినం.
రైతులను ఆదుకోవాలని సంకల్పం తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ అనుభవం తో పంటల సాగు కు నీటి విడుదలకు ఇంజనీర్లను మెప్పించి, ఒప్పించి,నీటి విధులకు కృషి చేశారు.
రంగదాముని పల్లి కి ప్రతి సారి జీవన్ రెడ్డి సాగు నీరు విడుదలచేయించారని గుర్తు చేశారు.రోళ్లేవాగు పూర్తి చేసి ఉంటే ధర్మపురి రైతులు సాగు నీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు.
బీ ఆర్ ఎస్ ప్రభుత్వం కమీషన్ల పై దృష్టి పెట్టి రైతులను విస్మరించింది.
రైతుల విలువైన భూములు లాక్కొని 300 కోట్ల ప్రతిపాదనలు చేసి, కమిషన్ ల కోసం బడ్జెట్ పెంచారని ఆరోపించారు.
జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గ రైతులను ఆదుకునేందుకు 11,946 ఎకరాల సాగుకు ఒక టీ ఏం సీ నీటి విడుదలకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుతజ్ఞతలు తెలిపారు.