రవాణా భారం తగ్గించేందుకే ఉచిత ప్రయాణం - మహిళలపై బీఅర్ఎస్ వివక్ష మానుకోవాలి - తాటిపర్తి విజయలక్ష్మి 

On
రవాణా భారం తగ్గించేందుకే ఉచిత ప్రయాణం - మహిళలపై బీఅర్ఎస్ వివక్ష మానుకోవాలి - తాటిపర్తి విజయలక్ష్మి 

రవాణా భారం తగ్గించేందుకే ఉచిత ప్రయాణం - మహిళలపై బీఅర్ఎస్ వివక్ష మానుకోవాలి

-జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి 

జగిత్యాల ఆగస్టు 16:

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటి స్పందన చూసి జీర్ణించుకోలేని బీఆరెస్ పార్టీ విమర్శలకి దిగడం దురదృష్టకరం అని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి  అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశం లో విజయలక్ష్మి మాట్లాడుతూ ఆడవాళ్లు అంటే బీఆరెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్ లు చేసుకోవచ్చని మాట్లాడ్డం మహిళల పట్ల అయనకున్న గౌరవం, సంస్కారం కు నిదర్శనం అన్నారు.

పబ్ లు, క్లబ్ లు, బ్రేక్ డ్యాన్స్ లు రాష్ట్ర రాజధాని లో ప్రోత్సాహించిన చరిత గత తెలంగాణ పాలకులకే ఉందని, అదే అందరు పాటిస్తారని భావించడం సరికాదన్నారు. మహిళలకు ప్రయాణం భారం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఉచిత రవాణా పథకం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు బీఆరెస్ నచ్చవా లేక మింగుడు పడడం లేదా అర్థం కావడం లేదన్నారు.

ఆర్టీసీ ఉచిత ప్రయాణం నచ్చకపోతే పథకం పై విమర్శలు చేయాలి తప్ప అందులో ప్రయాణించే మహిళా ప్రయనీకులపై విమర్శలు చేయడం తగదని, ఈ వైఖరి మానుకోవాలని హితవు పలికారు.

Tags