ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ 
తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది. 

నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ  రెండు సార్లు అవకాశం కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ  సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.

టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.

టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.

గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.

గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే  30 వేల మంది నియామకాలు చేపట్టినం.

గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.

గ్రూప్ 2  పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా  అప్గ్రేడ్ చేసినం.

సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.

గ్రూప్ -1  మెయిన్స్ కు 1:100 
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.

బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.

డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.

ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను   ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.

ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా  ప్రతి సంవత్సరం 
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Tags