కారుణ్య నియామకం కింద అర్చకులుగా నందనం సందీప్ కుమార్
On
నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి జూలై 15
(ప్రజామంటలు) :
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ముఖ్య అర్చకులుగా పనిచేయుచూ, కొద్ది కాలం క్రితం మరణించిన నందనం సదానందం స్థానంలో ఆయన కుమారుడు నందనం సందీప్ కుమార్ కారుణ్య నియామకం కింద అర్చకులుగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఉత్తర్వులు అందించిన కమిషనర్ ఎం. హనుమంతరావు, అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణారావు, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ రామాల సునీతకు అర్చక బృందం తరపున సందీప్ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తనకు నియామక పత్రాన్ని అందించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఈఓ కిషన్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags