జగిత్యాల యవర్ రోడ్ విస్తరణకు 100 కోట్లు ఇవ్వండి - సిఎం కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతి

On
జగిత్యాల  యవర్ రోడ్ విస్తరణకు 100 కోట్లు ఇవ్వండి - సిఎం కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతి

జగిత్యాల యవర్ రోడ్ విస్తరణకు 100 కోట్లు ఇవ్వండి - సిఎం కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతి

హైదారాబాద్ జులై 11:

యావర్ రోడ్డు విస్తరణకు రు.100 కోట్లు మంజూరు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కి  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ  విప్ అడ్లురి లక్ష్మన్ కుమార్ తో కలిసి వినతి పత్రం సమర్పించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ కోసం  100 కోట్లు మంజూరు చేయాలని, నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు సైతం నిధులు మంజూరు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు.

పట్టణంలో యావర్ రోడ్డు విస్తీర్ణత లో ఇళ్లు, దుకాణాలు కోల్పోయే వారికి పరిహారం చెల్లించడంతోపాటు పూర్తి స్థాయిలో 100 ఫీట్లకు యావర్ రోడ్డు విస్తరించేందుకు సుమారు 100 కోట్లు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారని,  ఆ మేరకు నిధులు మంజూరు చేసి దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోని యావర్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.
2008-09లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని 4000 మంది నిరుపేదలకు వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయగా, 1600 ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నిధుల మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనీ తెలిపారు.

Tags