కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు - తెలంగాణలో బిజేపి కి లబ్ది చేకూర్చడానికే బేయిల్ నిరాకరణ ?

On
కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు - తెలంగాణలో బిజేపి కి లబ్ది చేకూర్చడానికే బేయిల్ నిరాకరణ ?

ఎమ్మెల్సీ కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు
కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
తెలంగాణలో బిజేపి కి లబ్ది చేకూర్చడానికే బేయిల్ నిరాకరణ ?
మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత

న్యూ డిల్లీ ఏప్రిల్ 08 :

డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఈ రోజు మళ్ళీ తీవ్ర నిరాశ ఎదురయింది. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో... తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు... కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.  

ఆప్ ఎం పి సంజయ్ సింగ్ కు బాయిల్ ఇచ్చిన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందని ఊహించినా, కవితకు బెయిల్ ఇస్తే, తెలంగాణలో బిజేపి-బి ఆర్ ఎస్ పరోక్షంగా కుమ్ముకకైనట్లు స్పష్టం అవుతుందనే ఈ డి బెయిల్ ను వ్యతిరేకించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే ఈ డి కవిత బెయిల్ ను వ్యతిరేకయిస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి

Tags