హనుమాన్ జయంతి కి కట్టుదిట్టమైన భద్రత - సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ.

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.

On
హనుమాన్ జయంతి కి కట్టుదిట్టమైన భద్రత - సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల, ఏప్రిల్ 23(ప్రజా మంటలు) :

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవల కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు, దీక్ష పరులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు.

హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయం లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు, జెండా కు అంటించడం జరిగింది.రోడ్డు కు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

అనంతరం ఆలయ పరిసరాల్లో, మాలవిరమణ, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటలను పరిశీలించారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పి లు వినోద్ కుమార్ ,భీమ్ రావు, డిఎస్పి లు రఘు చంధర్ ,ఉమామహేశ్వర రావు, యస్ బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు , సి.ఐ రవి , ఎస్.ఐ లు ఉన్నారు.

Tags