ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి

On
ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి

ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి

ఉస్మానియా యూనివర్శిటీ మే 01:

ప్రొఫెసర్ (కామ్రేడ్) ఓంకారం ప్రథమ వర్ధంతిని అతని మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని జాగ్రఫీ విభాగంలో జరిగిన ప్రొఫెసర్ ఏసి ఓంకార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా,మిత్రులు సహచరులు ఘనంగా నివాళులు అర్పించి, ఆయన సేవలు కొనియాడారు.

ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ డా. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మానవ విలువలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిన ఓంకార్, తన వ్యక్తిగత జీవితాన్ని సమాజం కొరకు త్యాగం చేశాడని కొనియాడారు జాగ్రఫీ విభాగం అధిపతి డా.అశోక్ కుమార్ మాట్లాడుతూ ఒక ఆధ్యాపకుని గానే కాకుండా విద్యార్థులకు, యూనివర్సిటీకి మధ్య ఒక వారధిలా ఎన్నో సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించి, విద్యార్థులను చక్కని మార్గంలో నడిపించాడని కొనియాడారు కార్యక్రమం నిర్వహకులు, మాజీ ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షులు తుల రాజేందర్ తన ప్రసంగంలో ఓంకార్ వామపక్ష భావాలతో తన జీవితాన్ని ముడి వేసుకొని కుటుంబ జీవితానికి దూరమైన సమాజమే తన కుటుంబం గా యూనివర్సిటీలోని విద్యార్థులే తన పిల్లలుగా చివరి క్షణం వరకు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో అతని మిత్రులు సహచరులు పాల్గొన్నారు. ఓంకార్ సేవలు చిరకాలం గుర్తుండి పోయేలా ఆయన పేర జాగ్రఫీ విభాగంలో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. స్టాంన్లీ కళాశాల కృష్ణారావు ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఇతర కార్యక్రమాలను పూర్తిచేసి ఈ సంవత్సరం నుండే అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థికి  ఓంకార్ గోల్డ్ మెడల్ ఇవ్వాలని రిజిస్ట్రార్ ను కోరారు.

అలాగే ప్రతి సంవత్సరము ఓంకార్ మెమోరియల్ లెక్చర్ ను కూడా యూనివర్సిటీతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహించాలని దీనికి మిత్రులందరికీ సహకరించాలని నిర్వాహకుడు తుల రాజేందర్ కోరారు. 

ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న చివరి రోజులలో మిత్రులు కృష్ణారావు,రవీందర్, అజిత లు కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా చూసుకొన్నారని, అజిత్ దంపతులు తల్లిదండ్రులులా అదుకొన్నారని, వారి సేవలు మరువలేనివి మిత్రులు కొనియాడారు.

మిత్రులు, సహచరులు  ప్రో. వినయ్ బాబు, ప్రో.రాములు, తులసి సంపత్, కాసారపు సంజీవ్ గౌడ్, సంధ్య, బదురొద్దీన్, గురువా రెడ్డి, నాగేశ్వర్రా వు, శ్రీధర్, మామిడిపల్లి అశోక్,  పాల్గొన్నారు.

Tags