తెలంగాణలో బిజేపికి అనుకూలంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు

On
తెలంగాణలో బిజేపికి అనుకూలంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు

తెలంగాణలో బిజేపికి అనుకూలంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కోసమే లిక్కర్ కేసులో కవిత బెయిల్ నిరాకరణా? అభ్యర్థుల ఎంపికలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం?

తెలంగాణలో బిజేపికి అనుకూలంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు

ఎన్నికల కోసమే లిక్కర్ కేసులో కవిత బెయిల్ నిరాకరణా?

అభ్యర్థుల ఎంపికలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం?

హైదరాబాద్ ఏప్రిల్ (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

 దేశమంతా బిజేపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకొని, అధికారంలోకి రావడానికి నిర్విరామగా కృషి చేస్తుంటే, తెలంగాణలో అందుకు వ్యతిరేకంగా, బిజేపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు, బలహీనమైన అభ్యర్థులను పార్లమెంట్ స్థానాలలో నిలిపినట్లు జరుగుతున్నప్రచారం పట్ల కాంగ్రెస్ నాయకత్వం మేల్కొనయకపోతే నష్టం అనివార్యం.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నిన్నటి వరకు అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి వచ్చే నెలలో ఉన్న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో  తమ అభ్యర్థుల ఎంపికలో బిజేపికి అనుకూలంగా, వీలైనన్ని సీట్లు బిజేపి గెలవడానికి వీలుగా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో కనీసం 12-14 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యం పెట్టుకొన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెపుతున్నా, అందుకు విరుద్దంగా, చాలా స్థానాల్లో బలహీనమైన అభ్యర్థుల ఎంపిక చేసినట్లు ఆ పార్టీలోని వర్గాలే చెపుతున్నారు.

కాంగ్రెస్ లో బలమైన అభ్యర్థులు లేనట్లు భారతీయ రాష్ట్ర సమితి నుండి అరువు తెచ్చుకొని, చేవెళ్ళ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో వాలసవాడులకు టిక్కట్లు ఇచ్చింది. చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి, చేవెళ్ళ లో పట్నం సునిఠా రెడ్డి, భారతీయ రాష్ట్ర సమితి తమ అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు నిర్ణయించిన తరువాత, మరీ ముఖ్యంగా, వరంగల్ లో కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వారిని కాంగ్రెస్ లో  చేర్చుకొని, అక్కడి నాయకులకు, కార్యకర్తలకు షాక్ ఇస్తూ, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ వర్గాలే ఆశ్చర్యానికి గురిచేసింది.

అంతటా వలసవాదులకే దక్కిన ప్రాధాన్యత ?

మెదక్ స్థానంలో ఒక గ్రామ స్థాయి నాయకుని, గత ఎన్నికల్లో పఠాన్ చెరువు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కృషి చేసిన నీలం మధుకు టిక్కట్టు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయాలనుకాంగ్రెస్ నాయకులు, అభిమానులు అర్థం చేసుకోలేక చిటికీలపడిపోయారు. మెదక్ నుండి బిజేపి అభ్యర్థి రఘునందన రావు పోటీ చేస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి నుండి ప్రముఖ బిల్డర్, మాజీ కలెక్టర్ వేంకటరామ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన వేంకటరామ రెడ్డిని చివరి నిమిషంలో ఎంపిక చేయడం, డానికి అనుకూలంగానే నీలం మధును కాంగ్రెస్ ఎంపిక చేయడం అంతా చూస్తుంటే, పరోక్షంగా ఈ రెండు పార్టీలు బిజేపి అభ్యర్థిని గెలిపించడానికే కంకణం కట్టుకున్నాయా అనే అనుమానం వస్తుంది.

అనుకున్న స్థానాలకు బదులు మరోటి ఇవ్వడానికి కారణం ఏమిటి?

చేవెళ్ళ టిక్కట్టు ఆశించి కాంగ్రెస్ లో చేరిన పట్నం సునీత రెడ్డిని అక్కడి నుండి మల్కాజి గిరికీ మారచడం, సికింద్రాబాద్ లో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలోకి తీసుకొని టిక్కట్టు ఇవ్వడం కూడా అక్కడి అభ్యర్థులు ఈటల రాజేందర్, మంత్రి కిషన్ రెడ్డిల గెలుపుకు అనుకూల వాతావరణం కల్పించడానికే అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ గెలిచిన మరుసటి రోజు నుండే ప్రభుత్వానికి ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయనతో ఇబ్బంది పడ్డ బాధితులు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేసి న్యాయం చేయమని వెదుకొన్నారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని, సికింద్రాబాద్ పార్లమెంట్ టిక్కట్టు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ కారణాలతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక సందర్భంలో దానం అభ్యర్థిత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చూస్తున్నట్లు కూడా వినిపించింది. ఇంకా సమయం ఉందని అంటున్నారు. చూడాలి ఎం చేస్తారో.

హైదరాబాద్ స్థానం ఎలాగూ ఎం ఐ ఎం కు పరోక్షంగా అప్పగిస్తారు. ఇక మిగిలింది 11 స్థానలే. అందులో కరీంనగర్, ఖమ్మం సీట్లకు బలమైన అభ్యర్థులే దొరకడం లేదు. అదిలాబాద్ స్థానానికి ప్రజయహక్కుల పోరాట నాయకురాలు ఆత్రం సుగుణ ను ఎంపిక చేయడం అభినందనీయమే అయినా, ఆమె బిజేపి అభ్యర్థి, మాజీ ఎంపి నగేష్ ను ఎదుర్కోవడం కష్టమే. అందుకే భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే, సిరుపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కాంగ్రెస్ లో చేరారు.

సింగరేణి బెల్ట్ అంతా కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ కే మద్దత్తా?

నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భువనగిరి, నిజామాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి, స్థానాల్లో కూడా కాంగ్రెస్ తొపతి పడుతుందే తప్ప గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి. పెద్దపల్లి లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా అపోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వివేక్ కు కాంగ్రెస్ టిక్కట్టు ఇచ్చినా, ఆయన అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత ఉండి. సింగరేణి కార్మికునిగా జీవితం ప్రారంభించిన కొప్పుల ఈశ్వర్ కు ఉన్న స్థానిక మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికి లేదని, ఇక్కడ బి ఆర్ ఎస్ గెలుపు సులువని అనుకొంటున్నారు. ఇక్కడి బిజేపి అభ్యర్థి గోమాస  శ్రీనివాస్ కూడా బిజేపిలోకి మొన్ననే కాంగ్రెస్ నుండి వలస వచ్చాడు.  

----------------------

Tags