సూర్య గ్లోబల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు.

విద్యార్థులు భవిష్యత్తులో సమజాసేవ చేసే స్థాయికి ఎదగాలి - ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రావు.

On
సూర్య గ్లోబల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు ) : 

విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి సేవచేసి స్థాయికి ఎదిగి తల్లితండ్రులు, గురువులకు పేరు తీసుకురావాలని ట్రస్మా జగిత్యాల జిల్లా అధ్యక్షులు సూర్య గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ బోయినిపెళ్లి శ్రీధర్ రావు అన్నారు.

జిల్లా కేంద్రంలో సూర్య గ్లోబల్ స్కూల్ లో "సూర్య షైనింగ్ మూమెంట్స్2024" (కల్చరల్ మీట్) నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల కేరింతలతో అట్టహాసంగా జరిగింది. 

కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు బోయినిపెళ్లి శ్రీధర్ రావు, డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, మౌనికా రావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బోయినిపెళ్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ.... విద్యార్థులు నేటి సమాజంలో సెల్ ఫోన్ , టీవీ లకు బానిస కాకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ, గురువులు చూపిన దారిలో నడుస్తూ, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు సరైన శిక్షణ ఇస్తూ, సత్ఫలితాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ లో అకడెమిక్స్ లో, ఇతరత్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ లో మన సూర్య పిల్లలు భయం లేకుండా ముందుండడం చాలా అభినందనీయమన్నారు., ఇందులో ముఖ్యంగా శివతాండవం, బాల రామాయణం, అమ్మ గొప్పతనం తెలిపే నాటిక, రైతులు , సైనికుల గొప్పతనాన్ని చూపిస్తూ చేయబడిన డాన్స్ లు ఆహుతులను ఎంతగానో అలరించాయి.,

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, బోయినిపెల్లి శ్రీధర్ రావు-రజిత, బియ్యాల హరిచరణ్ రావు, జువ్వాడి మౌనికాహరిచరణ్ రావు , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags