కొనసాగుతున్న శ్రీమద్రామాయణ సప్తాహ కార్యక్రమం.

- విశ్వామిత్రుడిచే సరయూ నది విశిష్టత వివరణ. మరియు బల, అతిబల మంత్రాల ఉపదేశం..

On
కొనసాగుతున్న శ్రీమద్రామాయణ సప్తాహ కార్యక్రమం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ మన గుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ చే శ్రీమద్రామాయణం బాలకాండ ప్రవచన కార్యక్రమంలో భాగంగా రామలక్ష్మణులను యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడు గొనిపోవుట మొదట రామునికి బల, అతిబల మంత్రాలు విశ్వా మిత్రుడు మంత్రోపదేశం చేసి అనంతరం లక్ష్మణునికి మంత్రోపదేశం చేసిన ఘట్టాన్ని వివరించారు.

ఆ మంత్ర ప్రభావం వల్ల ఆకలి వేయదని, దప్పిక కలగదని, నిద్రపోతున్నప్పుడు, నిద్ర పోనప్పుడు రాక్షసుల నుండి ఎలాంటి ఆపద రాదని అంతేకాకుండా సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి బుద్ధి ప్రకాశిస్తుందని రామలక్ష్మణులకు తెలియజేసినట్లు గుర్తు చేశారు.

అదేవిధంగా సరయూ నది విశిష్టతను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించిన సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు తన ప్రవచనం ద్వారా రంజింప చేశారు. అదేవిధంగా రామలక్ష్మణులకు దర్భచే కూర్చ బడిన దానిపై పడుకోవడానికి ఏర్పాట్లు చేసాడు.

తిరిగి తెల్లవారుతున్నట్లుగా శ్రీరామునికి తెలపడానికి *కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే* అన్న శ్లోకాన్ని భక్తులచే ఆలపింపజేసి దాని అర్థాన్ని ఏ ఘట్టంలో వాడబడిందో ఉదాహరణలతో తెలియజేశారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు సామూహిక భజన కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉండగా మంగళవారంతో సప్తాహ కార్యక్రమం ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags