టీఎన్జీవోల ఆధ్వర్యంలో కొండగట్టులో చలివేంద్రం ఏర్పాటు

- ప్రారంభించిన అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర.

On
టీఎన్జీవోల ఆధ్వర్యంలో కొండగట్టులో చలివేంద్రం ఏర్పాటు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

కొండగట్టు ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు ) : 

*భక్తులకు పండ్లు పంపిణీ చేసిన టీఎన్జీవో మరియు ట్రెస్సా నాయకులు కొండగట్టు దేవస్థానం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా టీఎన్జీవో మరియు ట్రెస్సా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీరు,మజ్జిగ మరియు పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ టి.యస్.దివాకర ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు మంచినీరు, పండ్లు మరియు మజ్జిగ అందించారు.

మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టీఎన్జీవో ఉద్యోగులను మరియు ట్రెస్సా ఉద్యోగులను అడిషనల్ కలెక్టర్ అభినందించారు.

జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.మధుసూదన్ మరియు డిఎల్పిఒ కనకదుర్గ కార్యక్రమానికి విచ్చేసి చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు ఉద్యోగ సంఘ నాయకుల ను అభినందంచారు.

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మరియు ట్రెస్సా జిల్లా అధ్యక్షులు ఎండి. వకీల్ ఆధ్వర్యంలో నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొని భక్తులకు చలివేంద్రం ద్వారా సేవా కార్యక్రమాలు అందించారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి, ట్రెస్సా జిల్లా కార్యదర్శి నవీన్, తాసిల్దార్లు మునిందర్, కృష్ణచైతన్య, కృష్ణ, వరప్రసాద్ మరియు టిఎన్జిఒ నాయకులు సాహెద్ బాబు, రవీందర్, ఉమాపతి, మమత, రాములు, రాజేశం, మెహమూద్, కుమారస్వామి, సంపత్, సుగుణాకర్, మధుకర్, మహేందర్, సునీత్, హరి ప్రసాద్, సురెందర్, ప్రసాద్, ఖాజీం, రాజశ్రీ మల్యాల, కొడిమ్యాల మండల ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags