కలియుగంలో భగవన్నామ స్మరణనే ముక్తికి మార్గం

On
కలియుగంలో భగవన్నామ స్మరణనే ముక్తికి మార్గం

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల ఏప్రిల్ 15( ప్రజా మంటలు) : 

కలియుగంలో భగవన్నామస్మరణ ద్వారానే ముక్తి లభిస్తుందని పురాణ ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలెం చంద్రశేఖర్ శర్మ అన్నారు.

గత ఐదు రోజులుగా జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీమద్రామాయణ సప్తాహ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రవచనాల్లో సరయూ నదిలో స్నానం చేసినప్పుడు కలిగే ఫలితాలు, పుష్కర స్నానం విశిష్టత, తాటక వద గౌతముడు అహల్య దంపతుల చరిత్ర, ఇంద్రునికి గౌతమునిచే శాపం, అహల్య శాపవిమోచనం, రాముడు అడిగిన ఆశ్రమ వివరణ తదితర ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

కార్యక్రమం అనంతరం మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ భజన కార్యక్రమం కొనసాగింది.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు మంగళవారం సప్తాహం ముగింపు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags