స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ - తుక్కుగూడ సభలో రాహుల్ అంధి

On
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ - తుక్కుగూడ సభలో రాహుల్ అంధి

పదేళ్ళ మోడీ పాలనలో పేదలు మరింత పేదలు
కార్పోరేట్‌ కంపెనీలకు లక్షలకోట్లు మాఫీ
రైతులకు మాత్రం మొండిచేయి చూపిన మోడీ
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు
ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ
నిరుద్యోగులకు తోణ ఉద్యోగావకాశాలు..ఉపాధి కల్పన
తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసిచూపాం
దేశంలోనూ ఐదు గ్యారెంటీల అమలుకు కట్టుబడి పనిచేస్తాం
గత సిఎం కెసిఆర్‌ అధికార దుర్వినియోగంపై విమర్శలు
మేడిన్‌ తెలంగాణ బ్రాండ్‌ రావాలని అకాంక్ష
తుక్కుగూడ జనజాతర వేదికగా రాహుల్‌ హావిూ

హైదరాబాద్‌,ఏప్రిల్‌6(ఆర్‌ఎన్‌ఎ):

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలోని పేదలు మరింత నిరుపేదలయ్యారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్‌ వ్యక్తులకు మాత్రమే రుణమాఫీ చేశారు గానీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా న్యాయపత్రం పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్‌ గాంధీ.. తాను మేనిఫెస్టో రిలీజ్‌ చేయడానికే వచ్చానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడే తమ గ్యారెంటీలను విడుదల చేశామని.. ప్రజల గొంతుని వినిపించేలా తాజా మేనిఫెస్టోని సిద్ధం చేశామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని హావిూ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 30వేల ఉద్యోగాలను తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేసిందని.. మరికొన్ని ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతు న్నామని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల మనసులోని మాటలే తమ మేనిఫెస్టోలో ఉన్నాయని.. తామిస్తున్న ఐదు గ్యారెంటీలు తమ మేనిఫెస్టోకి ఆత్మలాంటివని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని.. వారికి ప్రత్యేక్ష శిక్షణ ఇస్తామని.. అన్ని రంగాల్లోని నిరుద్యోగులకు సంవత్సరానికి రూ.1 లక్ష చొప్పున స్టైఫండ్‌తో ట్రైనింగ్‌ ఇప్పిస్తామని మాటిచ్చారు. ఉద్యోగాలు చేసే మహిళలు.. ఆఫీసులో, ఇంట్లో కలిపి రెండు ఉద్యోగాలు చేస్తున్నారని ప్రశంసించారు. సంవత్సరానికి ప్రతి పేద మహిళకు రూ.1 లక్ష ఇస్తామని, ఆ డబ్బులను నేరుగా బ్యాంకుల్లో వేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణలో తరహాలోనే దేశంలోనూ కులగణన చేస్తామని, కులగణన చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని వెల్లడిరచారు. దేశంలో ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు.. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాటిచ్చారు. అలాగే.. జాతీయ ఉపాధి హావిూ పథకం కింద కార్మికులకు కనీసం వేతనం రోజుకి రూ.400 అందిస్తామని చెప్పారు. భారత్‌లోనే ప్రముఖ కంపెనీ ఓనర్లలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లేరని.. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాల్సినంత లేదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో కూడా సర్వే చేసి.. భారత్‌లోని ధనం ఎవరి దగ్గర ఉందో బయటపెడతామని అన్నారు. ప్రజల హక్కులను ప్రజలకు తప్పకుండా అందించి తీరుతామని రాహుల్‌ గాంధీ ఉద్ఘాటించారు. తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కుటుంబ సంబంధం అన్నారు. తెలంగాణ

ప్రజలు విద్వేషాల బజార్లో ప్రేమ దుకాణాలను తెరిచారు. జీవితాంతం విూకు అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నా. రాష్ట్రం నుంచి చిన్న పిల్లోడు నన్ను పిలిచినా ఇక్కడికి వస్తాను. తెలంగాణ కొత్త రాష్ట్రం. కాంగ్రెస్‌ పాలనలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మేడ్‌ ఇన్‌ చైనా కంటే.. మేడ్‌ ఇన్‌ తెలంగాణ అనే వ్యవస్థగా మారాలి’ అని రాహుల్‌ అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హావిూలను అమలు చేసినట్లుగానే.. జాతీయస్థాయిలోనూ కచ్చితంగా అమలుచేసి తీరుతామని  రాహుల్‌ గాంధీ అన్నారు. కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే గ్యారంటీ కార్డు విడుదల చేశాను. రూ.500 సిలిండర్‌, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి, గ్యారంటీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తున్నాం. ఈ సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం. మరో 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయి. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం. మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం. వాటిని నేరుగా బ్యాంకులోనే జమ చేస్తాం. ఇది ఓ విప్లవాత్మక పథకం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదని అన్నారు.  మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతుకు ఒక్క రూపాయి కూడా  మాఫీ చేయలేదు. స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తాం. జాతీయస్థాయిలో కనీస వేతనం  రూ.400కి పెంచుతాం. ఉపాధి హావిూ కూలీలకు వేతనం పెంచుతాం. దేశంలో 50శాతం జనాభా బీసీలుండగా... 8శాతం ఎస్టీలు, 15శాతం మంది మైనార్టీలు ఉన్నారు. మొత్తంగా 90శాతం పేదలే ఉన్నారు.  దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90శాతం మంది కనిపించరు.  దేశంలోని 90 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటే ముగ్గురే బీసీలు. జనాభాలో ఓబీసీలు 50శాతం.. ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతం మాత్రమే  అని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఇదే పార్టీ అభిమతమని చెప్పారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉంటే.. కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయన్నారు. గత సీఎం  కెసిఆర్‌ ఎలా పనిచేశారో విూ అందరికీ తెలుసు. వేల ఫోన్లు ట్యాప్‌ చేయించారు. రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ట్యాపింగ్‌ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక్కడ మాజీ సీఎం చేసిందే.. కేంద్రంలో మోదీ చేస్తున్నారు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. దేశంలోనే భాజపా అతిపెద్ద వాషింగ్‌ మెషీన్‌గా మారింది. దేశంలోని అవినీతిపరులంతా మోదీ ముందే నిల్చొన్నారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో విూకే అర్థమవుతోందని అన్నారు. ఈ సభకు భారీగా జనం హాజరయ్యారు. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ జనజాతర సభ నిర్వహించింది. కార్యక్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు భట్టి, ఉత్తమ్‌, శ్రీధర్‌ బాబు, సీతక్క, పొన్నం, సీనియర్‌ నేతలు విహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.

`````````````````````````

Tags