నేటి నుంచి బడ్జెట్ సెషన్!!మధ్యతరగతి ఆశలపై నిర్మల సీతారామన్ కరుణో కక్షో తేలేది రేపే
నేటి నుంచి బడ్జెట్ సెషన్!!మధ్యతరగతి ఆశలపై నిర్మల సీతారామన్ కరుణో ? కక్షో? తేలేది రేపే
న్యూ ఢిల్లీ జనవరి 31;
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు నేడు పార్లమెంట్లో ప్రారంభం కానున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రేపు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు..
ఇది ప్రస్తుత సంవత్సరం మొదటి సెషన్ కాబట్టి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆతరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
దీని తరువాత, నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎనిమిదవ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించి, ఆపై ప్రసంగిస్తారు. దీని తర్వాత ఫిబ్రవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో రాజ్యసభలో చర్చ జరగనుంది.
ఈ చర్చలపై ఫిబ్రవరి 6న రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. రెండు దశల్లో జరిగే బడ్జెట్ సెషన్లో మొత్తం 27 సెషన్లు జరుగుతాయి. మొదటి దశ 9 సెషన్లు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. తదనంతరం, రెండవ దశ మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించబడుతుంది.
ద్రవ్య ద్రవ్యోల్బణం, ధరల అస్థిరత, ఒకే దేశం ఒకే ఎన్నికలు, వర్ఫ్ సవరణ బిల్లు, గ్రామీణాభివృద్ధి, జిడిపి వృద్ధి, ఉపాధి కల్పన, రైతు- సీనియర్ సిటిజన్లు - చిన్న వ్యాపారాలకు రాయితీలపై కూడా చర్చించవచ్చు.