ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు - విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్
ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు
- విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్
గొల్లపల్లి జనవరి 29 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం భూమిని
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తాసిల్దార్ వరదన్ హెచ్చరించారు.
బుధవారం గొల్లపల్లి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 735 లోని ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని వాస్తవానికి ఎవరికి ఎలాంటి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వలేదన్నారు. కొందరు వ్యక్తులు పైరవీ చేస్తూ అమాయకులను ఆసరా చేసుకుని వారి వద్ద డబ్బులు గుంజుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పురగొలుపుతున్నట్టు దృష్టికి వచ్చిందని అలాంటి వారి మాటలు నమ్మ వద్దన్నారు ఎలాంటి ప్రభుత్వాలు అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన విక్రయించిన చట్టరీత్య నేరమని అలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తాసిల్దార్ హెచ్చరించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు అనంతరం మండల కేంద్రంలోని కబ్జా గురైన పలు స్థలాలను తాసిల్దార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆక్రమణలకు గురైన స్థలాల వివరాలపై ఒక నివేదిక తయారు చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు అక్రమ నిర్మాణానికి పోయారని అక్రమార్కులకు ఆదేశాలు జారీ చేశారు