ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు.   

On
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు.   

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు.   

న్యూ డిల్లి ఏప్రిల్ 15;

డిల్లి లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని, రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు 9 రోజులు పొడిగించింది.

మరో 9 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించింది. 15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉండనున్నారు.

మరోవైపు కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న సమయంలోఅక్కడున్న మీడియాతో కవిత మాట్లాడుతూ... ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అని అన్నారు. బీజేపీ నేతలు బయట మాట్లాడేవే... లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడుగుతున్నదే అడుతుతున్నారని ఆరోపించారు.

Tags