మహిళా డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ మరియు మత్తుమందుల పై అవగాహన సదస్సు

On
 మహిళా డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ మరియు మత్తుమందుల పై అవగాహన సదస్సు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ మరియు మత్తుమందుల నిరోధకంపై అవగాహన సదస్సు

జగిత్యాల ఏప్రిల్ 16(   ప్రజా మంటలు )
 స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో ప్రభుత్వ వైద్య విభాగం మరియు జాతీయ సేవా పథకం జంతు శాస్త్ర విభాగం మరియు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ  సైకియాట్రీ మరియు ఔషధ విభాగం అధిపతి డాక్టర్ ఆకుల విశాల్  తో పాటుగా సాకేత్ మరియు మౌనికలు  వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాలలోని విద్యార్థులకు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి వివరించారు.
మత్తు మందుల వినియోగం మరియు మత్తుమందులకు బానిసవడం వల్ల కలిగే నష్టాలు,   మత్తుమందులకు బానిసలు అయిన వ్యక్తుల యొక్క ప్రవర్తనలను గుర్తించి వారికి సరైన దిశా నిర్దేశం చేయాల్సిందిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల బాధ్యత అని సైకియాట్రీ విభాగం అధిపతి డాక్టర్ ఆకుల విశాల్ పేర్కొన్నారు
 కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కొత్త వ్యక్తులతో పరిచయమైనప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, వారి ప్రవర్తన, మనతో మాట్లాడే విధానాన్ని గమనించి, విద్యార్థి దశలోనే వాటికి బానిస కాకుండా సన్మార్గంలో  అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు సూచించిన మార్గంలో నడిచి మంచి భవిష్యత్తును పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా,   ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వేముల జమున, జంతు శాస్త్ర విభాగం,హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిలక్ష్మి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ కే కిరణ్ మై,  ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య,  కంప్యూటర్ లెక్చరర్ సంకీస సత్యం. తదితర అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags